దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- January 23, 2025
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించిన కొత్త బస్ పూలింగ్ సర్వీస్ నివాసితులలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రారంభించిన మొదటి 10 రోజుల్లోనే 500 మందికి పైగా ఈ సేవను ఉపయోగించుకున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. కొందరు ప్రయాణికులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కరామా నివాసి తారెక్ ప్రతిరోజూ బిజినెస్ బేలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ఈ సర్వీస్ ను ఉపయోగిస్తున్నారు. "ఇది ఇది RTA బస్సు కంటే ఉత్తమం. ఎందుకంటే మీరు బస్ స్టాప్‌కు సమయానికి చేరుకోకపోతే, మీరు తదుపరి బస్సు కోసం వేచి ఉండాలి. అలాగే మధ్యలో చాలా స్టాప్‌లు ఉన్నాయి. ఈ సర్వీస్ నన్ను నా ఇంటి నుండి కార్యాలయానికి 15 నుండి 20 నిమిషాల్లో చేరవేస్తుంది. ఇది చాలా పొదుపుగా కూడా ఉంది." అని వివరించాడు. డిసెంబర్ 2024లో ప్రారంభించబడిన బస్ పూలింగ్ సర్వీస్, స్మార్ట్ యాప్‌లలో బుకింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు మినీబస్ రైడ్‌లను ఎంచుకోవచ్చు. స్థానికంగా, అంతర్జాతీయంగా ప్రజా రవాణా వ్యవస్థలలో ప్రత్యేకత కలిగిన మూడు కంపెనీల సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుంది. ఈ-హెయిల్ ట్యాక్సీ సేవల కంటే ఈ సర్వీస్ ధర దాదాపు 20 నుంచి 30 శాతం చౌకగా ఉంటుందని ఆర్టీఏ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







