నీ పిలుపు కోసం
- July 09, 2015
ప్రియ నేస్తమా ! నేనిక నిష్క్రమిస్తున్నాను ,
ఈ పచ్చని చేలల్లో చెట్టు స్నేహితుల
బాహువుల్లో ఉయలలూగిన మన పల్లె తల్లి
అనుభూతుల నుండి బాల్యం బడి ఒడిలో
మనసు స్వేచ్చా విహంగమై నింగి కెగసిన
తీపి జ్ఞాపకాల నుండి,చల్లని సాయం సంధ్యలెన్నో
నన్ను సేద దీర్చిన నీ మమతానురాగాల నుండి
నా నిరీక్షణ లో మౌన ప్రతిమవయ్యే నిను
క్షోభింప చేసి,
తరలి పోతున్నాను నేస్తం.
నీవు లేని ఒక నిర్జీవ నిశ్శబ్ధ సమాధిలోకి
కాలం నిర్దేశించిన ఒంటరి బ్రతుకు పోరాటం లోకి
ఇక నేనక్కడ అత్మియతనుబందాలు లేని
శిలలా...
ఆశల ఆశ్వాలకు కళ్ళెం వేసిన మునిలా
నీ ఆలోచనల జ్ఞాపకాలన్నీ
శూలాలై నా హృదయాన్ని
గాయపెడుతుంటే,
ఓర్చుకుంటూ నన్ను నేను ఓదార్చుకుంటూ
మర యంత్రంలా సాగిపోతుంటాను
అయితేనేం సఖీ
కాలం కలిసొస్తే,
నీవు మరొక్క సారి
వసంత గాన కోకిలై పిలవాలని
నేనొక చెదరని చిరు నవ్వునయి
నీ పెదవులఫై ఉదయించాలన్న
ఆశతో ....
(07-07-2015 బ్రతుకుదెరువు కోసం తన వాళ్ళందరిని వీడి, గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న వారందరకు అంకితం.)
--బోడ జయ రెడ్డి(అబుధాబి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







