సౌదీలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!!

- January 24, 2025 , by Maagulf
సౌదీలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!!

రియాద్ : సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో గురువారం నుండి సోమవారం వరకు వివిధ తీవ్రతలతో కూడిన వర్షం పడుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NMC) తెలిపింది. NMC సూచన ప్రకారం.. వర్షం పడే సమయంలో 50 నుండి 60 km/h వేగంతో దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయాన్నారు. టోర్నడోలు లేదా వాటర్‌స్పౌట్‌లతో పాటు, తీరప్రాంతాల్లో ప్రవాహాలు, వడగళ్ళు మరియు ఎత్తైన అలలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మక్కా, అల్-బాహా, అసిర్, జజాన్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులలో గురువారం నుండి సోమవారం వరకు మరియు తూర్పు ప్రావిన్స్, రియాద్, ఖాసిం ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. మదీనా ప్రాంతంలోని అల్-మహ్ద్, అల్-హనకియా గవర్నరేట్‌లలో గురువారం నుండి శనివారం వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తాయని కేంద్రం తెలిపింది. జెడ్డా, ఖులైస్‌లోని గవర్నరేట్‌లు శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం నుండి సోమవారం వరకు నజ్రాన్ ప్రాంతంలో, సోమవారం తబుక్ ప్రాంతంలో ఇదే వాతావరణం ఉంటుంది. 
కింగ్‌డమ్‌లోని చాలా ప్రాంతాలలో సోమవారం వరకు భారీ ఉరుములతో కూడిన వర్షం కొనసాగుతుందని సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. మక్కా, రియాద్ ప్రాంతాలు మోస్తరు నుండి భారీ వర్షపాతం, వడగండ్ల వానలు, దుమ్ముతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. అల్-బహా, అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్, ఖాసిమ్, హైల్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com