ఎతిహాద్ కొత్త హై-స్పీడ్ రైలు..30 నిమిషాల్లో దుబాయ్ నుండి అబుదాబికి..!!

- January 24, 2025 , by Maagulf
ఎతిహాద్ కొత్త హై-స్పీడ్ రైలు..30 నిమిషాల్లో దుబాయ్ నుండి అబుదాబికి..!!

యూఏఈ: ఎతిహాద్ రైల్ అబుదాబి, దుబాయ్‌లను కలుపుతూ మొట్టమొదటి హై-స్పీడ్, ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలును ఆవిష్కరించింది. హై-స్పీడ్ రైలు ద్వారా రెండు ఎమిరేట్స్ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలుగా పేర్కొన్నారు. దీంతో పాటు ఒక సాధారణ ప్యాసింజర్ రైలు కూడా అందుబాటులో ఉంటుంది. హై-స్పీడ్ రైలు ఆరు స్టేషన్ల రీమ్ ఐలాండ్, సాదియత్, యాస్ ఐలాండ్, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్‌లోని అల్ జద్దాఫ్ గుండా వెళుతుంది. షార్జా, ఫుజైరాలో స్టేషన్లు కూడా ఉంటాయి. GCC రైల్వే అమలులోకి వచ్చిన తర్వాత ఇది విస్తృత GCCకి విస్తరించనున్నారు. యూఏఈ నేషనల్ రైల్ నెట్‌వర్క్ రాబోయే ఐదు దశాబ్దాల్లో యూఏఈ స్థూల జాతీయోత్పత్తి (GDP)కి Dh145 బిలియన్లను జోడించగలదని అంచనా వేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com