ఫస్ట్ ఇసుక బీచ్ జెడ్డా నార్త్ ఓబుర్‌లో ప్రారంభం..!!

- January 24, 2025 , by Maagulf
ఫస్ట్ ఇసుక బీచ్ జెడ్డా నార్త్ ఓబుర్‌లో ప్రారంభం..!!

జెడ్డా : జెడ్డా మయోరల్టీ నార్త్ ఓబుర్‌లో 17,640 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫస్ట్ ఇసుక బీచ్‌ను ప్రారంభించారు. వాటర్‌ఫ్రంట్‌లను పునరుద్ధరించడానికి, మోడల్ పబ్లిక్ ఇసుక బీచ్‌లను ఏర్పాటు చేయడానికి మేయర్‌లటీ యొక్క ప్రయత్నాలలో భాగంగా ఈ బీచ్ ను ప్రారంభించారు. బీచ్ ప్రారంభమైనప్పటి నుండి పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులను ఆకట్టుకుంటుందని మెరైన్ మానిటరింగ్ కెప్టెన్ యొక్క అండర్ సెక్రటరీ థామర్ నహ్హాస్ తెలిపారు. సౌదీ లైఫ్ సేవింగ్ ఫెడరేషన్ ద్వారా గుర్తింపు పొందిన లైఫ్‌గార్డ్‌లను బీచ్ లో ఏర్పాటు చేశామని,  ఏదైనా అత్యవసర పరిస్థితులకు తక్షణ ప్రతిస్పందనలను వారు సమర్థవంతంగా ఎదుర్కొంటారని అతను వివరించారు. ఈ బీచ్‌లో భద్రత, అత్యవసర రెస్క్యూ ప్రయత్నాలను మెరుగుపరచడానికి సముద్ర నిఘా టవర్‌లను ఏర్పాటు చేశామని నహ్హాస్ చెప్పారు. పర్యావరణ హితంగా సౌరశక్తితో పనిచేసే లైట్లు ఏర్పాటుతోపాటు స్విమ్మింగ్ అవర్స్ పై బీచ్‌కి వెళ్లేవారికి మార్గనిర్దేశం చేయడానికి సైన్ బోర్డులు కూడా చేశామన్నారు. నార్త్ ఓబుర్‌లోని మరో రెండు బీచ్‌లపై మేయర్‌టీ పనిచేస్తోందని, ఒకటి 10,320 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, మరొకటి 75,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com