పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..
- January 25, 2025
న్యూ ఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.అవార్డులకు ఎంపికైన వారిలో ఒకరు విదేశీయులు ఉన్నారు.బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురు జోనస్ మాశెట్టి, కువైట్‌కు చెందిన షేకా ఏజే అల్ సబాహ్, నేపాల్‌కు చెందిన నరేన్ గురుంగ్ సైతం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు కేటగిరిల్లో కేంద్రం అందిస్తుంది. కళలు, సమాజ సేవ, ప్రజా సంబంధాలు,సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం,సాహిత్యం, విద్య, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారిని అవార్డులకు ఎంపిక చేస్తారు.ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తూ వస్తున్నారు.
పద్మ అవార్డులు వచ్చింది వీరికే..
- నందమూరి బాలకృష్ణ (కళలు)-ఆంధ్రప్రదేశ్
- ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం)-కర్ణాటక
- సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు)-బిహార్
- వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)-అమెరికా
- పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు)-గుజరాత్
- పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు)-మహారాష్ట్ర
- రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం)-ఉత్తర్‌ప్రదేశ్
- బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య)-ఎన్సీటీ దిల్లీ
- జతిన్ గోస్వామి (కళలు)-అస్సాం
- అనంత్ నాగ్ (కళలు)-కర్ణాటక
- పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు)-కేరళ
- ఎస్.అజిత్ కుమార్ (కళలు)-తమిళనాడు
- శేఖర్ కపూర్ (కళలు)-మహారాష్ట్ర
- శోభన చంద్రకుమార్ (కళలు)-తమిళనాడు
- జోస్ చాకో పెరియప్పురం (వైద్యం)-కేరళ
- కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ)-ఎన్సీటీ దిల్లీ
- మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు)-మహారాష్ట్ర
- నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు)-తమిళనాడు
- సాధ్వీ రీతంభర (సామాజిక సేవ)-ఉత్తర్‌ప్రదేశ్
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







