యూఏఈలో డాక్టర్ల కోసం యూనిఫైడ్ లైసెన్స్ విధానం..!!

- January 29, 2025 , by Maagulf
యూఏఈలో డాక్టర్ల కోసం యూనిఫైడ్ లైసెన్స్ విధానం..!!

యూఏఈ: హెల్త్‌కేర్ వర్కర్లకు లైసెన్స్‌లను అందించడానికి యూఏఈ ఏకీకృత(యూనిఫైడ్) జాతీయ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP)లోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. ఈ లైసెన్సింగ్ ప్రక్రియ వైద్య నిపుణులు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో ఎక్కడైనా పనిచేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. "ఇది ఆరోగ్య రంగంలో జాతీయ ప్రాజెక్ట్. యూఏఈ అంతటా ఉన్న ఆరోగ్య సంస్థలను ఒక ప్లాట్‌ఫారమ్‌లోకి చేర్చుతుంది. ప్రస్తుతం, ప్రతి సంస్థ వారి స్వంత అవసరాల ఆధారంగా ఆరోగ్య నిపుణులకు లైసెన్స్ ఇస్తుంది. కొత్త సిస్టమ్‌తో, మేము ఈ ప్రక్రియలను యూనిఫైడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. " అని ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) వద్ద లైసెన్సింగ్ అక్రిడిటేషన్ విభాగం తాత్కాలిక డైరెక్టర్ అల్లా మన్సూర్ యాహ్యా తెలిపారు. ప్లాట్‌ఫారమ్ కచ్చితమైన రోల్ అవుట్ తేదీని ప్రకటించనప్పటికీ, ఇది త్వరలో ప్రారంభించబడుతుందని యాహ్యా ధృవీకరించారు. తాము ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఈ కార్యక్రమం చివరి దశలో ఉందని, త్వరలో అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.  యూనిఫైడ్ ప్లాట్‌ఫారమ్ ఆరోగ్య నిపుణులు తమ లైసెన్స్‌లను పొందేందుకు అవసరమైన సమయాన్ని తగ్గిస్తుందని యాహ్యా తెలిపారు.  హెల్త్ ప్రొఫెషన్స్ లైసెన్స్‌ విధానం వైద్యులతోపాటు నర్సులు, ఫార్మసిస్ట్‌లు, అనుబంధ వైద్య నిపుణులు, సాంకేతిక సిబ్బంది అందరికి వర్తిస్తుందని పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com