విక్రమ్, నయనతార & నిత్యల కామినేషనలో 'ఇంకొక్కడు'

- June 30, 2016 , by Maagulf
విక్రమ్, నయనతార & నిత్యల కామినేషనలో 'ఇంకొక్కడు'

విక్రమ్‌, నయనతార, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రం 'ఇరుముగన్‌'. ఈ సినిమా తెలుగు టైటిల్‌ను సింగపూర్‌లో నిర్వహిస్తున్న సైమా అవార్డుల వేడుకల్లో ప్రకటించారు. 'ఇంకొక్కడు' అనే టైటిల్‌ను తెలుగులో ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై శిబు థమీన్స్‌ నిర్మిస్తున్నారు. హారిస్‌ జయరాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం తమిళ టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com