యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌: టైర్‌ 2లో బహ్రెయిన్‌

- July 01, 2016 , by Maagulf
యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌: టైర్‌ 2లో బహ్రెయిన్‌

యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ర్యాంకింగుల్లో టైర్‌ 2 దేశాల కేటగిరీలో రెండోసారి ఛాన్స్‌ దక్కించుకుంది బహ్రెయిన్‌. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ని అరికట్టేందుకు బహ్రెయిన్‌ తీసుకుంటున్న చర్యల్ని కొనియాడింది. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ (టిఐపి) రిపోర్ట్‌లో బహ్రెయిన్‌ అను నిత్యం ట్రాఫికింగ్‌ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఒసామా అల్‌ అబ్సి ఈ విషయాల్ని వెల్లడించారు. నేషనల్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కమిటీకి ఈయన ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నేషనల్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కమిటీ, ఓ షెల్టర్‌ని బాధితుల కోసం ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ బాధితుల కోసం సౌకర్యాలను కల్పిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com