'శారీ' ట్రైలర్ విడుదల
- February 12, 2025
ఆర్జీవీ మలయాళీ భామ శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)తో శారీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎప్పుడూ చీరలే కట్టుకునే ఓ అమ్మాయిని ఓ ఫోటోగ్రాఫర్ ఇష్టపడి ప్రేమ అంటూ వెంటతిరిగి ఆ ప్రేమ మరీ ఎక్కువయి, ఆ అమ్మాయి తనకే సొంతం అనే భావనతో సైకోగా మారి ఎలాంటి పనులు చేసాడు? ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథతో శారీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఆరాధ్య దేవి, సత్య యదు, సాహిల్, అప్పాజీ అంబరీష్, కల్పలత.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా కథని ఆర్జీవీ రాసి ప్రజెంట్ చేయగా రవి శంకర్ నిర్మాణంలో గిరి కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఇక ఈ శారీ సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. మరి ఈ సినిమాతో ఆరాధ్య దేవి తెలుగులో హీరోయిన్ గా సెటిల్ అవుద్దా చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







