అమెరికా, బ్రిటన్ ఎయిర్ పోర్ట్ ల మీద కూడా దాడి చేస్తాం: ఐఎస్ఐఎస్

- July 02, 2016 , by Maagulf
అమెరికా, బ్రిటన్ ఎయిర్ పోర్ట్ ల  మీద కూడా దాడి చేస్తాం: ఐఎస్ఐఎస్

అమెరికాను, బ్రిటన్ ను కూడా వదలబోమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ సంస్థకు మద్దతిచ్చేలా ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ బెదిరింపులు వెల్లడయ్యాయి. లాస్ ఎంజెల్స్ ఇంటర్నేషనల్, జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్, లండన్ లోని హ్యాత్రూ ఇంటర్నేషనల్ విమానాశ్రయంపైన, విమానాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఐసిస్ హెచ్చరించింది. ఈ నెల (జూలై 4)న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల కాలంలో ఓర్లాండో ఘటన, తర్వాత టర్కీలోని ఇస్తాంబుల్, తాజాగా ఢాకాలో ఐసిస్ ఘటనలు చోటుచేసుకోగా.. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలో ఈ దాడుల ప్రణాళిక విఫలమైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ మధ్య ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఐసిస్ తన పడగ విప్పుతునే ఉంది. తాజాగా మరోసారి అమెరికాకు, బ్రిటన్ కు ఈ దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడంతో ఆ దేశాలు ముందస్తు జాగ్రత్తకు దిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com