షార్జాలో 19 వాహనాలను సీజ్..భారీగా జరిమానాలు..!!
- February 20, 2025
యూఏఈ: రోడ్లపై డ్రైవర్లు ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేయడంతో 19 వాహనాలను సీజ్ చేసినట్టు షార్జా పోలీసులు తెలిపారు.రోడ్ల పై ప్రమాదకర విన్యాసాలు చేసి, జీవితాలను పాడు చేసుకోవద్దని, ఇతరుల ప్రాణాలకు హానీ కలిగించవద్దని పోలీసులు కోరారు. సంబంధిత వాహన డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు షార్జా పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ మహ్మద్ అలై అల్ నక్బీ తెలిపారు. వాహనదారుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ ప్లేట్లు లేకుండా నడపడం, వాహనం లైసెన్స్ ప్లేట్‌లను కనిపించకుండ చేయడం, అధిక శబ్దం కలిగించే వాహనాన్ని నడపడం వంటి అనేక ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఉల్లంఘనలకు ట్రాఫిక్ చట్టం ప్రకారం 3,000 దిర్హం వరకు జరిమానా, 23 ట్రాఫిక్ పాయింట్లు, 90 రోజుల పాటు వాహనాన్ని జప్తు చేయడంతో పాటు, 20,000 దిర్హాంల వరకు వాటిని విడుదల చేసినందుకు ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







