హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్

- February 20, 2025 , by Maagulf
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్

హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో ప్రయాణించే వారికి ప్రత్యేక రాయితీలను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో 10 శాతం, రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. టీజీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com