మణిరత్నం, కార్తిల కొమినేషన్లో మొదలు కానున్న కొత్త సినిమా

- July 03, 2016 , by Maagulf
మణిరత్నం, కార్తిల కొమినేషన్లో మొదలు కానున్న కొత్త సినిమా

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కార్తి కాంబినేషల్‌లో ఈనెల 8న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మణిరత్నం ఫేవరెట్‌ షూటింగ్‌ స్పాట్‌ అయిన వూటీలో మొదలవుతుంది. ఈ చిత్రంలో కార్తి జంటగా ఆదితి రావు హైదారీ నటించనుంది. సినిమాలోని ఓ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు. అనంతరం కశ్మీర్‌లో షూటింగ్‌ జరగనుంది. ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు తన సొంతవాయిస్‌తోనే డబ్బింగ్‌ చెప్పాలని మణి కోరడంతో తమిళం నేర్చుకునే పనిలో ఉందట ఆదితి. చిత్రానికి సంగీతం ఏఆర్‌ రెహమాన్‌, కెమెరామెన్‌ రవి వర్మన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com