రియాద్‌లోని ఖాసర్ అల్-హుక్మ్ డౌన్‌టౌన్ మెట్రో స్టేషన్ ప్రారంభం..!!
- February 26, 2025
రియాద్: రియాద్ మెట్రో నెట్‌వర్క్‌లోని ఖాసర్ అల్-హుక్మ్ డౌన్‌టౌన్ స్టేషన్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని రియాద్ నగరానికి రాయల్ కమిషన్ ప్రకటించింది. ఇది నెట్‌వర్క్‌లోని నాలుగు ప్రధాన స్టేషన్లలో ఒకటని తెలిపింది. మెట్రో బ్లూ, ఆరెంజ్ లైన్లను బస్సు రవాణా నెట్‌వర్క్‌తో అనుసంధానించే కీలకమైన కేంద్రమని పేర్కొంది. రియాద్ మధ్యలో ఉన్న ఖాసర్ అల్-హుక్మ్ ప్రాంతంలోని పరిపాలనా సౌకర్యాలు, రాజభవనాలు, చారిత్రక మార్కెట్లు, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని తెలిపింది.
ఖస్ర్ అల్-హుక్మ్ స్టేషన్ సల్మానీ ఆర్కిటెక్చర్ ను ఆధునికంగా డిజైన్ చేశారు. దాంతో స్టేషన్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటుంది.స్టేషన్లో ఒక వినూత్నమైన గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణీకులు తమ రైలు ప్రయాణాల కోసం వేచి ఉన్నప్పుడు ఆహ్లాదాన్ని పంచుతుందని ప్రకటించారు.
ఈ స్టేషన్ 22,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 35 మీటర్ల భూగర్భ లోతుతో ఏడు అంతస్తులతో కూడిన 88వేల చదరపు మీటర్ల భవన ఉపరితలాలపై నిర్మించారు. ఇందులో 17 ఎలక్ట్రిక్ ఎలివేటర్లు, 46 ఎస్కలేటర్లతోపాటు అనేక దుకాణాలు, సేవలు, ప్రజా సౌకర్యాలు, పెయింటింగ్‌లు, కళాత్మక శిల్పాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!