'టుగెదర్ వీ ప్రొగ్రెస్' ఫోరమ్‌ను ప్రారంభించిన సయ్యద్ థెయాజిన్..!!

- February 26, 2025 , by Maagulf
\'టుగెదర్ వీ ప్రొగ్రెస్\' ఫోరమ్‌ను ప్రారంభించిన సయ్యద్ థెయాజిన్..!!

మస్కట్: సాంస్కృతిక, క్రీడలు,  యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థియాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ "టుగెదర్ వి ప్రోగ్రెస్" ఫోరమ్ మూడవ ఎడిషన్‌ను ప్రారంభించారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జనరల్ సెక్రటేరియట్ ద్వారా నిర్వహించే ఈ ఫోరమ్ ప్రభుత్వం – కమ్యూనిటీ మధ్య పరస్పర కమ్యూనికేషన్‌ను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించడానికి ఒక వేదికను అందిస్తుంది. అయితే పౌరులు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు, సవాళ్లను తెలియజేయడానికి అనుమతిస్తుంది.

రెండు రోజుల ఫోరమ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిపై దృష్టి సారించే రెండు చర్చా సెషన్‌లను కలిగి ఉంది. రాబోయే పంచవర్ష ప్రణాళిక, ఆర్థిక వైవిధ్యం, జాతీయ ఆర్థిక వృద్ధిలో పెట్టుబడి పాత్రపై సమీక్ష నిర్వహిస్తారు. వీటితోపాటు ఐదు డైలాగ్ సెషన్‌లు గవర్నరేట్ డెవలప్‌మెంట్, వృత్తులు, ఉద్యోగాల భవిష్యత్తు, పదవీ విరమణ వ్యవస్థ, సంస్కృతి, క్రీడలు, యువత, ఆర్థిక వైవిధ్య రంగాల భవిష్యత్తు వంటి అంశాలను కవర్ చేస్తాయి. కమ్యూనిటీ పార్టనర్‌షిప్, సిటిజన్ ఎంగేజ్‌మెంట్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. జాతీయ అభివృద్ధిలో సామాజిక అభిప్రాయాలు, ఆకాంక్షలను హిజ్ మెజెస్టి సుల్తాన్ దృష్టికి ప్రత్యక్ష సంభాషణ ద్వారా తీసుకువెళ్లడం ఫోరమ్ లక్ష్యం అని సెక్రటరీ జనరల్ హైలైట్ చేశారు. ఫోరమ్ థీమ్‌ల ఎంపికలో 19,000 కంటే ఎక్కువ మంది పౌరులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com