యూఏఈలో గోల్డ్ కొనుగోలు, లీజింగ్ కోసం కొత్త యాప్..!!

- February 27, 2025 , by Maagulf
యూఏఈలో గోల్డ్ కొనుగోలు, లీజింగ్ కోసం కొత్త యాప్..!!

యూఏఈ: యూఏఈ బేస్డ్ యాప్.. నివాసితులు బంగారాన్ని Dh1 కంటే తక్కువకు కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. కొనుగోలుదారులు తమ బంగారాన్ని లీజుకు ఇచ్చి, దాని నుండి డబ్బు సంపాదించే అవకాశాన్ని అందించే కొత్త సేవను ప్రారంభించింది. O గోల్డ్ యాప్ దాని వినియోగదారులను కేవలం 0.1 గ్రాముల బంగారాన్ని లీజుకు తీసుకోవడానికి, వారు కలిగి ఉన్న బంగారం నుండి 16 శాతం వార్షిక ఆదాయాన్ని పొందేందుకు అనుమతిస్తుంది.  ఈ అవకాశాన్ని అందించడానికి గోల్డ్ లీజింగ్ మానిటరీ మెటల్స్ (MM)లో గ్లోబల్ లీడర్‌తో యాప్ ఒప్పందం చేసుకుంది. MM-దుబాయ్ సీఈఓ మార్క్ పే దీనిని యూఏఈ నివాసితులకు ప్రయోజనం చేకూర్చే "అద్భుతమైన ఆవిష్కరణ"గా పేర్కొన్నారు.     

2023లో ప్రారంభించిన ఈ యాప్ లో 50వేల మందికి పైగా యాక్టివల్ కస్టమర్లు ఉన్నారని ఓ గోల్డ్ ఛైర్మన్ బందర్ అల్-ఓత్మాన్ తెలిపారు. ప్రజలు బంగారంపై నిరంతరం పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని అన్నారు. ప్రతి సంవత్సరం, అనేక దేశాలు వారి ఫియట్ కరెన్సీతో సమస్య ఎదుర్కొంటున్నాయని, కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను 50 శాతం తగ్గించాయని, అయితే బంగారం ధర మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోందని, గత ఏడాది మాత్రమే ధర 25 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని లీజుకు ఇస్తుంటాయని, సాధారణ ప్రజలు కూడా ఇలాగే చేయడానికి ఈ యాప్‌ వారికి అవకాశం కల్పిస్తోందని ఆయన తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com