అక్రమ నిధుల సేకరణ ప్రచారాలపై హెచ్చరిక జారీ..!!

- February 27, 2025 , by Maagulf
అక్రమ నిధుల సేకరణ ప్రచారాలపై హెచ్చరిక జారీ..!!

రియాద్: రమదాన్ సందర్భంగా అక్రమ నిధుల సేకరణ కోసం జరిగే ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇస్లామిక్ అఫైర్స్, కాల్,  గైడెన్స్ మంత్రి డా. అబ్దుల్లతీఫ్ అల్-షేక్ హెచ్చరించారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మంత్రి తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన ప్రకటనలో.. ప్రతి ఒక్కరూ తమ విరాళాలను అధికారిక మార్గాల ద్వారా మాత్రమే అందించాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా అక్రమంగా నిధుల సమీకరణకు సంబంధించిన కొన్ని ఉదహరణలను మంత్రి ప్రస్తావించారు. ఒక కంపెనీ మసీదుల నిర్మాణం, పునరుద్ధరణ కోసం పౌరుల నుండి డబ్బు వసూలు చేసింది. అధికారుల నుండి అనుమతులు ఉన్నాయని నమ్మించి దాతలను మోసం చేసింది. మక్కాలో మసీదులను నిర్మించడానికి SR90 మొత్తంలో విరాళాలు సేకరిస్తామని ఒక సంఘం ప్రచారం చేసిన విషయం కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. చట్టాలను ఉల్లంఘించి నిధులను సేకరించే సంస్థలు, వ్యక్తులకు జరిమానాలతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చట్టవిరుద్ధంగా విరాళాలు సేకరించే వ్యక్తికి SR 500000 మించకుండా జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని చట్టం నిర్దేశిస్తుందని, జైలు శిక్ష అనుభవించిన తర్వాత విదేశీయులను బహిష్కరించడంతో పాటు హజ్, ఉమ్రా నిబంధనల ప్రకారం వారు తిరిగి రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరని ఆయన పేర్కొన్నారు. విరాళాలు సేకరించే లైసెన్స్ లేని సంస్థకు SR500000 మించకుండా జరిమానా విధించబడుతుందన్నారు. ఉల్లంఘన పునరావృతమైతే జరిమానా రెట్టింపు చేయబడుతుందని,చట్టంలోని ఆర్టికల్ 9లోని నిబంధనలను ఉల్లంఘించి విరాళాలు సేకరించడానికి పిలుపునిచ్చే లైసెన్స్ పొందిన సంస్థకు SR200000 మించకుండా జరిమానా విధించబడుతుందని. ఉల్లంఘన పునరావృతమైతే జరిమానా రెట్టింపు చేయబడుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com