షార్జాలో రమదాన్ 2025: 10 ఇఫ్తార్ ఫిరంగి ప్లేసేస్ ఇవే..!!

- February 28, 2025 , by Maagulf
షార్జాలో రమదాన్ 2025: 10 ఇఫ్తార్ ఫిరంగి ప్లేసేస్ ఇవే..!!

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ ఫిరంగిని ప్రయోగించేందుకు షార్జా పోలీసులు 10 ప్రదేశాలను గుర్తించారు. ఫిరంగులు అల్ మజాజ్ వాటర్ ఫ్రంట్, మువైలిహ్ సబర్బ్ కౌన్సిల్, అల్ సియుహ్ సబర్బ్ కౌన్సిల్, అల్ రహ్మానియా సబర్బ్ కౌన్సిల్,  అల్ హమ్రియా సబర్బ్ కౌన్సిల్‌లో ఉన్నాయి.

అల్ మదామ్ నగరంలోని తవిలా పరిసరాల్లోని అల్ దైద్ ఫోర్ట్ , అల్ నయీమ్ మసీదు.. తూర్పు ప్రాంతంలో క్లాక్ టవర్,అల్ హఫియా లేక్, కల్బా నగరం, ఖోర్ఫక్కన్ యాంఫీథియేటర్,  దిబ్బా అల్ హిస్న్ నగరంలోని ఫ్లాగ్‌పోల్ ప్రాంతాలను నిర్ణయించారు.  

చరిత్రకారుల ప్రకారం.. 10వ శతాబ్దపు ఈజిప్టులో ఫిరంగులను పేల్చే ఆచారం ప్రారంభమైంది. ఇది ఇఫ్తార్ సమయం అని ప్రజలకు తెలియజేయడానికి వాటిని పేల్చే వారు.  నెలవంక వీక్షణపై ఆధారపడి, రమదాన్ మార్చి 1న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28న సాయంత్రం రమదాన్ కోసం నెలవంకను చూడాలని ముస్లింలందరికీ యూఏఈ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com