రమదాన్ సందర్భంగా అత్యవసర సేవలు 24/7 కొనసాగుతాయి..!!
- February 28, 2025
దోహా, ఖతార్: పవిత్ర రమదాన్ మాసంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో అధికారిక పని వేళలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లతో సహా హమద్ మెడికల్ కార్పొరేషన్ ఆసుపత్రులలో అత్యవసర, ఇన్‌పేషెంట్ సేవలు 24/7 పనిచేస్తాయి. ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ వారంలో ఏడు రోజులు 12 ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర సంరక్షణ సేవలను అందజేస్తుంది.
ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలు తమ సేవలకు సంబంధించిన వివరణాత్మక పని వేళలను ప్రకటిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంత్రిత్వ శాఖ రమదాన్ సందర్భంగా కొన్ని సేవా విభాగాలకు పని గంటలు ఇలా ఉన్నాయి.
మెడికల్ కమిషన్ విభాగం: 9:00 AM - 5:00 PM.
విదేశాలలో వైద్య సంబంధాలు మరియు చికిత్స విభాగం (ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ భవనంలో): ఉదయం 9 - మధ్యాహ్నం 1గం.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జనన నమోదు కార్యాలయాలు:
మార్నింగ్ షిఫ్ట్: 9:30am - 1:30pm.
సాయంత్రం షిఫ్ట్ (ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ వద్ద): 1:30pm - 4:30pm.
జననాలు, మరణాల కమిటీ (మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్): 9:30am - 1:30pm.
డెత్ రిజిస్ట్రేషన్ యూనిట్ (యునిఫైడ్ ఆఫీస్ ఫర్ హ్యుమానిటేరియన్ సర్వీసెస్): 9:30am - 4:30pm.
యూనిఫైడ్ హెల్త్‌కేర్ కాంటాక్ట్ సెంటర్ (16000) 24/7 పని చేస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!