రియాద్ లో అర్ధరాత్రి 2వరకు మెట్రో.. అర్ధరాత్రి 3వరకు బస్ సర్వీసులు..!!

- February 28, 2025 , by Maagulf
రియాద్ లో అర్ధరాత్రి 2వరకు మెట్రో.. అర్ధరాత్రి 3వరకు బస్ సర్వీసులు..!!

రియాద్: రియాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పవిత్ర రమదాన్ మాసంలో రియాద్ మెట్రో,  పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల రోజువారీ ఆపరేటింగ్ వేళలను ప్రకటించింది. రియాద్ మెట్రో శుక్రవారం మినహా అన్ని రోజులలో అర్ధరాత్రి 2:00 గంటల వరకు నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు తెల్లవారుజామున 3:00 గంటల వరకు పనిచేస్తాయి. రియాద్ మెట్రో శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తాయి. ఈ సేవ తెల్లవారుజామున 3:00 గంటల వరకు కొనసాగుతుంది. రమదాన్ సందర్భంగా రైలు, బస్సు సర్వీసుల సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది.

రియాద్ మెట్రో

ఆదివారం నుండి గురువారం వరకు: 8:00 AM నుండి 2:00 AM వరకు

శుక్రవారం: 12:00 PM నుండి 3:00 AM వరకు

శనివారం: 10:00 AM నుండి 2:00 AM వరకు

ప్రజా రవాణా బస్సులు

రోజూ 6:30 AM నుండి 3:00 AM వరకు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com