పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన సీపీ సుధీర్ బాబు
- February 28, 2025
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ ఈ రోజు పదవీ విరమణ పొందిన పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ రాములు,ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేందర్,నాగోల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై నారాయణరెడ్డి, మరియు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ Md. జాఫర్ అలీ లకు సీపీ సుధీర్ బాబు రాచకొండ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, సుఖదుఃఖాలతో కలగలిపి ఉంటుందని, విధి నిర్వహణలో అన్నిటినీ సమానంగా స్వీకరించి ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు.వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమములో డీసీపీ అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శివ కుమార్, ఎసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్, సీసీఆర్బి ఎసిపి రమేష్,చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సుగుణ,చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సీహెచ్ భద్రారెడ్డి,కృష్ణారెడ్డి, కో- ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్