ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ స్వరైల్..
- March 02, 2025
న్యూ ఢిల్లీ: భారత్‌లో ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే టెక్నాలజీని బాగా వాడేస్తోంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు భారతీయ రైల్వే స్వరైల్ యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
రైలు ప్రయాణికులకు సంబంధించిన అన్ని సేవలనూ ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు. ఈ ఒక్క యాప్ ద్వారానే ప్రయాణికులు టికెట్లు, ఎంక్వైరీలతో పాటు పార్శిల్ బుకింగ్స్, లైవ్ ట్రైన్ స్టేటస్, టికెట్ల రద్దు, రీషెడ్యూల్, ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఇవేగాక మరిన్ని సేవలు ఒకే యాప్‌లో అందనున్నాయి. రైళ్లు ఆలస్యమైతే కూడా ఈ యాప్ ద్వారా అప్‌డేట్లు వస్తాయి.
‘స్వరైల్’ ఫీచర్లు
- ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్: టికెట్ బుకింగ్‌లు, రిజర్వేషన్ల కోసం
- రైల్ మదద్: ఫిర్యాదుల పరిష్కారం, ఆన్‌బోర్డ్ సహాయం కోసం
- నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్: రియల్ టైమ్ రైలు ట్రాకింగ్, స్టేటస్ అప్‌డేట్స్ కోసం
- అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్: రిజర్వ్ చేయని టికెట్ కొనుగోళ్ల కోసం
- భోజనం: కొన్ని స్టేషన్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది
ఈ సేవలన్నింటినీ ఒకే యాప్ కిందకు తీసుకువస్తే ప్రయాణికులు ఇతర అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, వారి సమయం వృథా కావడం వంటివి తగ్గుతాయి.
స్వరైల్ లాంచ్ అయ్యేలోపు ఈ యాప్ వాడవచ్చు
స్వరైల్ యాప్ అధికారికంగా లాంచ్ అయ్యేలోపు ఇప్పటికే ఉన్న ఎన్టీఈఎస్ (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) యాప్‌తో రైలు లేట్, రూట్ మళ్లింపులు, రైళ్ల రద్దు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎన్టీఈఎస్ యాప్‌ను ఎలా వాడాలి?
ఎన్టీఈఎస్ యాప్ ప్రయాణికులకు స్టేటస్ అప్‌డేట్‌లు, ట్రైన్ రద్దు, తాత్కాలిక హాల్ట్‌లతో పాటు రియల్-టైమ్ రైలు సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్ వెర్షన్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా సమీపంలోని స్టేషన్లలో రైళ్లు రాకపోకలు, బయలుదేరే సమయాలను చూసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్