పాస్‌పోర్ట్ కొత్త నియమాలు–జనన ధృవీకరణ తప్పనిసరి...!

- March 02, 2025 , by Maagulf
పాస్‌పోర్ట్ కొత్త నియమాలు–జనన ధృవీకరణ తప్పనిసరి...!

న్యూ ఢిల్లీ: పాస్‌పోర్ట్ పొందేందుకు ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న‌లు(Passport Rules) రిలీజ్ చేసింది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చింది.1980 నాటి పాస్‌పోర్ట్ రూల్స్‌లో స‌వ‌ర‌ణ చేసింది.పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న స‌మ‌యంలో..జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల‌ని కొత్త రూల్స్‌లో పేర్కొన్నారు.

స‌వ‌రించిన నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 2023,అక్టోబ‌ర్ 1 క‌న్నా ముందు జ‌న్మించిన వాళ్లు..బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌ను ప్రూఫ్‌గా ఇవ్వాల‌ని పేర్కొన్నారు.మున్సిపాల్టీల్లో ఇచ్చే బ‌ర్త్ స‌ర్టిఫికేట్లు లేదా, మెట్రికులేష‌న్‌, స్కూల్ స‌ర్టిఫికేట్లు, లేదా ప్యాన్ కార్డ్‌, పీపీవో, ఎల్ఐసీ బీమా పాల‌సీ ప‌త్రాల్లో ఏదో ఒక‌టి స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని కేంద్రం తెలిపింది.

 ఇక 2023, అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ త‌ర్వాత జ‌న్మించిన వారు మాత్రం..రిజిస్ట్రార్ ఆఫ్ బ‌ర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లేదా ఇత‌ర అధికారులు ఇచ్చే జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌రిపోతాయ‌ని ఆ నోటిఫికేష‌న్‌లో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com