రమదాన్..BLS పాస్‌పోర్ట్ కేంద్రాల పని వేళల్లో మార్పులు..!!

- March 03, 2025 , by Maagulf
రమదాన్..BLS పాస్‌పోర్ట్ కేంద్రాల పని వేళల్లో మార్పులు..!!

కువైట్: రమదాన్ సందర్భంగా పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ ధృవీకరణ కోసం BLS అవుట్‌సోర్సింగ్ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేశారు.  కువైట్ సిటీ, జలీబ్ అల్-షుయౌక్ (అబ్బాసియా), ఫహాహీల్, జహ్రాలోని  కేంద్రాలలో పవిత్ర రమదాన్ మాసంలో పని చేసే కొత్త వర్కింగ్ అవర్స్ ను వెల్లడించారు.

రమదాన్ రోజులలో పాస్‌పోర్ట్, వీసా, ధృవీకరణ సేవల ప్రాసెసింగ్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం కేంద్రాలకు సెలవు ఉంటుంది. ఏ రోజుననైనా కాన్సులర్ ధృవీకరణ కోసం BLS కేంద్రాలలో జమ చేసిన పత్రాలను తదుపరి పని దినం మధ్యాహ్నం 3:00-4:00 గంటల వరకు సంబంధిత BLS కేంద్రంలో దరఖాస్తుదారులకు తిరిగి ఇస్తారు. అత్యవసర కేసులలో అదే రోజు ధృవీకరణ కోసం అభ్యర్థనలు అత్యవసర స్వభావం ఆధారంగా కేసు-టు-కేస్ ఆధారంగా నిర్ణయించబడతాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com