క్రికెట్ మానియా..వెయ్యిశాతం అధికంగా టిక్కెట్లు రీసేల్..Dh97,000 పలుకుతున్న ధరలు..!!

- March 05, 2025 , by Maagulf
క్రికెట్ మానియా..వెయ్యిశాతం అధికంగా టిక్కెట్లు రీసేల్..Dh97,000 పలుకుతున్న ధరలు..!!

యూఏఈ: ఇండియా, ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు చేరుకుంది. దీనితో దుబాయ్ గ్రాండ్ ఫినాలేకు వేదికైంది. నివాసితులు, పర్యాటకులు, క్రికెట్ ప్రేమికులు ఒక గంట వరకు ఆన్‌లైన్ క్యూలో వేచి ఉండి టిక్కెట్లను కొనుగోలు చేశారు. స్కై బాక్స్ కేటగిరీలోని Dh12,000 టిక్కెట్లతో సహా అన్ని టిక్కెట్లు 40 నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. దాంతో అనేక మంది క్రికెట్ అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

ఖరీదైన స్కై బాక్స్ టిక్కెట్లు కూడా అమ్ముడయ్యాయని కొంతమంది అభిమానులు ఆశ్చర్యపోయినప్పటికీ, రీ-సేల్ వెబ్‌సైట్‌లలో టిక్కెట్ల ధరలు ఒక అడుగు ముందుకు వేసింది. వియాగోగో ఈ టిక్కెట్లను Dh97,746కి సేల్ కు పెట్టింది. ఇది ప్రారంభ ధర కంటే 714 శాతం ఎక్కువ కావడం గమనార్హం.  అధిక ధరలు ఉన్నప్పటికీ, ఫైనల్ మ్యాచ్‌ను చూడాలని నిర్ణయించుకున్న క్రికెట్ అభిమానులు తమ చేతికి దొరికే టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. వెబ్‌సైట్‌లు ప్రతి కేటగిరీలో రెండు లేదా నాలుగు టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని రిమైండర్‌లను ప్రదర్శిస్తున్నాయి.

Xchangetickets వంటి కొన్ని వెబ్‌సైట్‌లు Dh250 జనరల్ అడ్మిషన్ టిక్కెట్లను Dh3,000 కు అమ్ముతామని ప్రకటించాయి. ఇది వాస్తవ టిక్కెట్ ధరకంటే 1,100 శాతం అధికం. Ticombo.. రీసేల్ వేదిక.  గ్రాండ్ లాంజ్ కోసం టిక్కెట్ల ధరలు Dh11,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రీమియం విభాగానికి Dh6,000 కంటే ఎక్కువ చూపిస్తున్నాయి. వెబ్‌సైట్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు, అధిక ధరలకు అమ్ముకునేందుకు బిడ్ లను ఆహ్వానిస్తుంది.   ఫిబ్రవరి 23న జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో రీసేల్ వెబ్‌సైట్‌లలో ఇలాంటి ధరలు పెరిగాయి. అప్పుడు మ్యాచ్ టిక్కెట్ల ధరలు 600 శాతం  అధికంగా అమ్ముడయ్యాయి.

భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 30 సంవత్సరాల తర్వాత ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి టీమ్ ఇండియా నిరాకరించింది. అప్పుడు దుబాయ్‌ను తటస్థ వేదికగా ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు క్రికెట్ మైదానంలో తమ అభిమాన జట్లు పోరాడటాన్ని చూడటానికి తరలివస్తున్నారు. మార్చి 9న, దుబాయ్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండవ సెమీ-ఫైనల్ విజేతలతో ఇండియా తలపడుతుంది. ఆన్‌లైన్‌లో ఫైనల్ పోరుకు టికెట్ పొందలేని వారికి, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం బాక్స్ ఆఫీస్‌లో ఫిజికల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఐసిసి వెబ్‌సైట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com