దెయిరా లో జోయాలుక్కాస్ నూతన షోరూం ప్రారంభం

- July 04, 2016 , by Maagulf
దెయిరా లో జోయాలుక్కాస్ నూతన షోరూం ప్రారంభం

జోయ్ ఆలుక్కాస్ సంస్థ పూర్తిగా నవీకరించిన దుబాయ్ షోరూమ్, దెయిరాను పునఃప్రారంభించింది. షోకేస్ ఫ్లోర్‌ను మరింతగా విస్తరించామని, డిస్‌ప్లే ఏరియాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని జోయ్ ఆలుక్కాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌ను తమ గ్రూప్ ఈడీ జాన్ పాల్ అలుక్కాస్ ప్రారంభించారని పేర్కొంది. ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినమ్‌ల్లో పది లక్షలకు పైగా వినూత్నమైన డిజైన్లలలో అభరణాలు లభ్యమవుతాయని ఈ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా జాన్ పాల్ ఆలుక్కాస్ పేర్కొన్నారు. ధర, ఎంపిక, సౌకర్యం, సేవలకు సంబంధించి వినియోగదారులకు ఉత్తమమైన ఆఫర్లనందించడమే తమ లక్ష్యమని జోయ్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ, జాయ్ ఆలుక్కాస్ తెలిపారు. 11 దేశాల్లో 120కు పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com