యాహ్యా సీఫుడ్ రెస్టారెంట్.. వేలమంది కార్మికులకు ప్రతిరోజూ ఇఫ్తార్..!!
- March 16, 2025
దుబాయ్: వాటర్‌ఫ్రంట్ మార్కెట్‌లోని ఉద్యోగులకు ఇఫ్తార్ అనేది ఒక ఖరీదైన వ్యవహారం. ఉద్యోగులు తాము అమ్మే వాటిని తినడం చాలా అరుదు. కానీ రమదాన్ సందర్భంగా, వారికి మరెక్కడా లేని విధంగా ఇక్కడ విందును అందిస్తారు. ప్రతి సాయంత్రం అస్ర్ ప్రార్థన తర్వాత, మార్కెట్ పార్కింగ్ ప్రాంతం భోజన స్థలంగా మారుతుంది. ఇక్కడ వందలాది మంది బిర్యానీతో కూడిన భోజనంతో ఉపవాసం విరమిస్తారు.
గత ఆరు సంవత్సరాలుగా వాటర్‌ఫ్రంట్ మార్కెట్‌లోని యాహ్యా సీఫుడ్ రెస్టారెంట్.. కార్మికులు, విక్రేతలు, దుకాణదారులకు ఉచిత ఇఫ్తార్ భోజనాలను అందిస్తోంది. పవిత్ర మాసంలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకుంటుంది. ఈ సంవత్సరం మార్కెట్‌లోని క్లీనర్లు, సీఫుడ్, మాంసం, కూరగాయల విక్రేతలు, సందర్శకులు, డెలివరీ రైడర్‌లతో పాటు ఉపవాసం ముగించడానికి వచ్చే డెలివరీ రైడర్‌లకు ప్రతిరోజూ 2,000 కంటే ఎక్కువ ఇఫ్తార్ భోజనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తమకు ఇంతగా ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడం ఒక సంప్రదాయంగా మారిందని రెస్టారెంట్ యజమాని యాహ్యాఫాయు అన్నారు. మార్కెట్‌లో సముద్ర ఆహార విక్రేత అయిన మొహమ్మద్ సల్మాన్.. ఇంత విలాసవంతమైన అనుభవాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!