APNRT కో-ఆర్డినేటర్ శివ కుమార్(బహ్రెయిన్) తో ముఖాముఖి
- March 24, 2017
APNRT కో-ఆర్డినేటర్ శివ కుమార్(బహ్రెయిన్) తో ముఖాముఖి
ప్ర) ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కో-ఆర్డినేటర్లు గా మీ బాధ్యత ఏమిటి?
జ) బహ్రెయిన్లో నివసిస్తున్న తెలుగువారినందరికి ఎన్నార్టి సభ్యత్వము యొక్క ప్రయోజనములు తెలియజేసి వారందరిని ఈ సంస్థలో మమేకం చేయడం. ఎన్నార్టి లక్ష్యాలు మరియు సేవల వివరాలు తెలియ చేయడం, ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కల్పించటం ముఖ్య బాధ్యతులు గా గుర్తిస్తాను.
ప్ర) ఆంధ్రప్రదేశ్‌తో విదేశాల్లోని తెలుగువారిని కలిపేందుకు ముందుకొచ్ చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ ణయం పట్ల మీ స్పందన ఏమిటి?
జ) ముఖ్య మంత్రి చంద్రబాబు గారి నిర్ణయం హర్షణీయం. రాష్ట్ర అభివృద్ధిలో విదేశాలలోని తెలుగు వారిని భాగస్వాములను చేసి, వారికి బాధ్యతాయుత సేవకులుగా గుర్తించబడే సేవా అవకాశములను కల్పించడములో ఈ నిర్ణయం గర్హనీయం. సర్వత్రా ఈ నిర్ణయానికి మంచి స్ఫూర్తి లభిస్తుందని ఆశిస్తున్నాను.
ప్ర) మాతృభూమికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పం చాలా గొప్పది, ఈ సంకల్పా న్ని విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదే శ్‌కి చెందినవారెలా భావిస్తున్ నారు?
జ) మాతృ భూమికి సేవచేయాలనే సంకల్పం విదేశాలలో ఉండే ప్రతి తెలుగువాడికి ఉంటుంది. ఈ సంకల్పాన్ని సాకారం చేసుకొనడానికి కావలిసిన విధానములను సదుపాయములను ఎన్నార్టి కలుగ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
ప్ర) కొత్త రాష్ట్రం, కోటి సమస్యలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐ ల తోడ్పాటు ఎలా ఉంటే బావుంటుందను కుంటున్నారు?
జ) కొత్త రాష్ట్రం లోని కోటి సమస్యలను సదావకాశములుగా గుర్తించి, ఎన్ఆర్ఐలు మమేకమై భాద్యతాయుతముగా శ్రీ చంద్ర బాబు నాయుడు గారు కల్పించిన ప్రభుత్వ ప్రణాళికలకు తమ తమ ప్రావీణతా రంగములో మార్గదర్శకత్వం మరియు కార్యదీక్షనిచ్చి విజయ సంకేతములకు నాంది పలికితే చాలా బాగుంటుంది.
ప్ర) ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా లేని కొత్త విధానం, కొత్త ఆలోచన ఇది . ఈ ఆలోచన విదేశాల్లో ఉన్న వారి గా మీకెలా అనిపిస్తోంది?
జ) ఇది ఒక గొప్ప ఆలోచన. దీన్ని ప్రవేశ పెట్టిన గౌరవనీయ ముఖ్య మంత్రి గారు మరియు ఈ ఆలోచనకు ఒక కార్య రూపమిచ్చిన డాక్టర్ రవి గారు అభివందనీయులు. విదేశాలలో ఉన్న మాకు, ఇది ఒక సదవకాశంగా భావిస్తాము. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతము చేయాలని మాకనిపించింది. ఈ ఉద్దేశముతో ముందుకు సాగు తున్నాము.
ప్ర) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఈ విషయంలో అందించే సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయి?
జ) ప్రభుత్వము నుంచి మంచి సహాయ సహకారములు అందుతున్నాయి. ఎప్పటికప్పుడు డాక్టర్ రవి గారు ప్రభుత్వ ప్రణాళికలను మాకు తెలియ చేస్తూ మమ్మలను ప్రోత్సహిస్తున్నారు.
ప్ర) మాతృభూమికి సేవ చేయడం ఓ గొప్ప అ వకాశం. ఆ అవకాశం కల్పించిన ప్రభు త్వానికి మీ తరఫున ఎలా కృతజ్ఞత తెలుపుతారు?
జ) ఈ అవకాశాన్ని కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. తమ తమ స్వగ్రామములకు సహాయము చేసికొనే సదావకాశముని విదేశాలలో ఉండే ఎన్నారైలకు ప్రసాదించారు. ఎన్నాఆర్టీ కి సేవ చేసి కృతజ్ఞతలు తెలియచేసుకుంటాము.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు