మష్రూమ్ ఆమ్లెట్
- March 02, 2018
కావలసిన పదార్థాలు
గుడ్లు - 2, మష్రూమ్స్ తరుగు - పావు కప్పు, ఉల్లి, క్యారెట్ తరుగు - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, చిక్కని పాలు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా. నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం
ముందుగా పాన్‌లో ఒక స్పూన్ నూనె వేడి చేసుకుని అందులో ఉల్లి, పచ్చిమిర్చి, క్యారట్ మరియు మష్రూమ్స్ తరుగు రెండు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో గుడ్లు, పాలు, ఉప్పు వేసి బాగా గిలకొట్టండి. ఇప్పుడు ఆమ్లెట్ పాన్‌లో మిగతా నూనె వేడి చేసుకుని గుడ్ల మిశ్రమాన్ని వేసి సన్నటి సెగపై ఉంచి మూత పెట్టండి. ఆమ్లెట్ సగం ఉడికిన తరువాత, మష్రూమ్స్ మిశ్రమంతో పాటు కొత్తిమీర చల్లి మూత పెట్టండి. ఆమ్లెట్ పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆపెయ్యండి. ఈ ఆమ్లెట్‌ను విడిగా కానీ బ్రెడ్‌తో లేదా చపాతీతో కూడా తినవచ్చు.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







