హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ: సీఎం చంద్రబాబు

- March 17, 2025 , by Maagulf
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ: సీఎం చంద్రబాబు

అమరావతి: హిందీ వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఉద్యమంలో జరుగుతోంది.ఏకంగా అక్కడ రూపాయి సింబల్ హిందీలో ఉందని మార్చేసి రూ అని తమిళంలో పెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.పీ4 పేరుతో జరిగిన చర్చలో చంద్రబాబు భాషపై జరుగుతున్న వివాదంపై స్పందించారు.

మాతృభాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని అదే టైంలో కమ్యూనికేషన్‌కు జీవనోపాధికి అవసరమయ్యే ఏ భాష అయినా నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్ని భాషలైనా నేర్చుకుంటామని కానీ మాతృభాషను మాత్రం మర్చిపోమని అభిప్రాయపడ్డారు. మన దేశంలోని భాషలే కాకుండా విదేశ భాషలు కూడా నేర్చుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని వివరించారు.

"కొంతమంది ఇంగ్లీష్ జ్ఞానంతో సమానమని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. భాష కమ్యూనికేషన్ కోసం మాత్రమే. అది జ్ఞానాన్ని తీసుకురాదు. మాతృభాషలో చదివినప్పుడు మంచి జ్ఞానం సంపాధిస్తారు. మాతృభాష నేర్చుకోవడం సులభం. అదే అనుభవంతో ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు" అని ఆయన అన్నారు.

హిందీ నేర్చుకుంటే ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ కమ్యూనికేషన్‌ సులభమవుతుందని అన్నారు. దీన్ని ఓ రాజకీయ అంశంగా చేసి వివాదాలు సృష్టించకుండా ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోవలాని అసెంబ్లీ అభిప్రాయపడ్డారు. "జీవనోపాధి కోసం మనం ఎన్ని భాషలనైనా నేర్చుకుంటాం. మనం మాతృభాషను మర్చిపోం. భాష కమ్యూనికేషన్ కోసం మాత్రమే.ఎక్కువ భాషలు నేర్చుకోవడం ఉత్తమం," అని చంద్రబాబు అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com