నిషేధిత కంటెంట్‌ను షేర్ చేస్తే Dh1 మిలియన్ జరిమానా, జైలుశిక్ష..!!

- March 18, 2025 , by Maagulf
నిషేధిత కంటెంట్‌ను షేర్ చేస్తే Dh1 మిలియన్ జరిమానా, జైలుశిక్ష..!!

యూఏఈ: సోషల్ మీడియాలో సామాజిక వ్యతిరేక, నైతికంగా అనైతిక కంటెంట్‌ను పోస్ట్ చేసి షేర్ చేసే 1 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా,  జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు పలువురు న్యాయవాదులు వెల్లడించారు. యూఏఈ చట్టం ప్రకారం, నిషేధించబడిన కంటెంట్‌ను షేర్ చేసే, తిరిగి పోస్ట్ చేసే లేదా పంపిణీ చేసే వ్యక్తి అసలు పోస్ట్ చేసిన వారితో సమానంగా బాధ్యత వహిస్తారు. యూఏఈ లోని సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవన సూత్రాలకు అనుగుణంగా వ్యవహారించాలని యూఏఈ జాతీయ మీడియా కార్యాలయం (NMO) పేర్కొంది.  జాతీయ చిహ్నాలు, ప్రజా వ్యక్తులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్‌కు వ్యతిరేకంగా తాజాగా హెచ్చరించారు.  చట్టాన్ని ఉల్లంఘించిన వారికి Dh1,000 నుండి Dh1 మిలియన్ వరకు జరిమానాలు విధించవచ్చని, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా Dh2 మిలియన్లకు పెరుగుతుందన్నారు. అదే సమయంలో ఉల్లంఘించే మీడియా సంస్థలను 6 నెలల వరకు తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని అల్ తమీమి & కంపెనీలో డిజిటల్, డేటా అసోసియేట్ ఫాత్మా అల్ జడ్జాలి ఖలీజ్ టైమ్స్‌తో అన్నారు.

సోషల్ మీడియా వాడకం అనేది యూఏఈలో ప్రవాసులు, జాతీయులలో బాగా ప్రాచుర్యం పొందింది. సగటున, ప్రతి నివాసి Instagram, Facebook, X, TikTok ఇతర ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సాధారణ మీడియా చట్ట ఉల్లంఘనలతో పాటు, సోషల్ మీడియాలో చేసిన నిర్దిష్ట చర్యలు కూడా తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com