షార్జాలో రెండు ప్రముఖ కిచెన్స్ సీజ్..!!

- March 20, 2025 , by Maagulf
షార్జాలో రెండు ప్రముఖ కిచెన్స్ సీజ్..!!

యూఏఈ: షార్జాలో ఆరోగ్య ప్రమాణాలను పాటించడంలో విఫలమైన రెండు ప్రముఖ కిచెన్స్ ను మూసివేసినట్లు ఎమిరేట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ సంస్థలు నిర్దేశించిన నిబంధనలను పాటించలేదని, వినియోగదారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు తనిఖీలో తేలిందన్నారు.

రమదాన్ మాసం సందర్భంగా ఇప్పటివరకు ఆహార సంస్థలలో 5,500 తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది. రమదాన్ సందర్భంగా షాపింగ్ మాల్స్‌తో సహా పగటిపూట ఆహార తయారీ,  అమ్మకాలకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెస్టారెంట్లు,ఫుడ్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది.  అదే సమయంలో రాత్రిపూట పనిచేసే ఫుడ్ కోర్టులు కూడా రమదాన్ మాసంలో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com