అప్సర హత్య కేసు–పూజారి సాయికి జీవిత ఖైదు
- March 26, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌కు చెందిన అప్సర హత్య కేసులో దోషిగా తేలిన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవత ఖైదు విధించింది. 2023లో అప్సర హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని అప్సర అడుగుతుండడంతో ఆమెను పూజారి శంషాబాద్‌కు కారులో తీసుకెళ్లి హత్య చేశాడు.
ఆ తర్వాత తన ఇంటి సమీపంలో డ్రైనేజీలో పూడ్చి పెట్టి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి సిమెంట్‌తో మూసేశాడు. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాలను శంషాబాద్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
పూజారి సాయికృష్ణ సరూర్ నగర్‌లో ఓ దేవాలయంలో పూజారి. అతడికి అప్పటికే పెళ్లి అయినప్పటికీ అప్సరతో అతడు పరిచయం పెంచుకుని, సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా వాళ్లు హాయిగా తిరిగారు. అప్సర గర్భం దాల్చడంతో అసలు సమస్య మొదలైంది.
తనను పెళ్లి చేసుకోవాలని పూజారికి అప్సర చెప్పింది. అయితే, దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ తాను ఇటువంటి పనులు చేస్తున్నానని ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని అప్సరను పూజారి చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2023 జూన్ 3న అప్సరతో కోయంబత్తూరు వెళ్దామని చెప్పాడు.
రాత్రి సమయంలో అప్సరను కారులో అతడు సరూర్‌నగర్ నుంచి తీసుకెళ్లి, శంషాబాద్ మండలం రాళ్లగూడలో ఓ హోటల్‌లో డిన్నర్ చేశాడు. ఓ గోశాలలో బెల్లం దంచే రాయిని తీసుకుని, కారులో పెట్టుకున్నాడు. ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున నర్కుడలో కారులో అప్సర నిద్రపోయింది.
అదే అదునుగా భావించి కారు సీటు కవర్‌తో ఆమెకు ఊపిరాడకుండా చేసి, అలాగే, ఆమె తలపై బెల్లం దంచే రాయితో బాదాడు. ఆమె మృతి చెందడంతో మృతదేహంపై కారు కవర్ కప్పి, సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అప్సర మృతదేహాన్ని డ్రైనేజీలో పూడ్చి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి, దానిపై సిమెంట్ కూడా వేయించాడు. ఆ తర్వాత అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి పూజారే నిందితుడని గుర్తించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!