ఉక్రేనియన్ మోడల్ మిస్సింగ్.. ఫేక్ వార్త: దుబాయ్ పోలీసులు

- March 27, 2025 , by Maagulf
ఉక్రేనియన్ మోడల్ మిస్సింగ్.. ఫేక్ వార్త: దుబాయ్ పోలీసులు

దుబాయ్: గతంలో ఉక్రేనియన్ మోడల్ తప్పిపోయినట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని దుబాయ్ పోలీసులు ఖండించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన నివేదికల ప్రకారం.. దుబాయ్ లో 20 ఏళ్ల యువతి పది రోజులుగా కనిపించకుండా పోయిందని, ఆమెను రోడ్డు పక్కన కొట్టి పడవేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. “ఈ వార్తలు అబద్ధం” అని దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపింది.

ఉక్రేనియన్ మోడల్ ఒక నిషేధిత నిర్మాణ స్థలంలోకి ఒంటరిగా ప్రవేశించి ఎత్తు నుండి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యిందని ఆ పోలీసు అధికారి స్పష్టం చేశారు. 20 ఏళ్ల మోడల్ ప్రస్తుతం దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో కోలుకుంటోందన్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి వైద్య సంరక్షణ పొందుతోందని పోలీసులు తెలిపారు.  

“ఈ సంఘటన మార్చి 12న జరిగిందని మేము నిర్ధారించాము. సంఘటన స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు. ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, ఆమె కోలుకుంటున్నందున ఆమె వైద్య సంరక్షణలో ఉంది” అని పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com