శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

- March 28, 2025 , by Maagulf
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రతీరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి. ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాలను టీటీడీ వెల్లడించింది.

ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాలు..

  • ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.
  • ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
  • ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
  • ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
  • ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
  • ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
  • ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
  • ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరునక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com