HMC అంబులెన్స్ సర్వీస్..రమదాన్ సేవలు సక్సెస్..!!

- March 31, 2025 , by Maagulf
HMC అంబులెన్స్ సర్వీస్..రమదాన్ సేవలు సక్సెస్..!!

దోహా: హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లోని అంబులెన్స్ సర్వీస్ పవిత్ర రమదాన్ మాసం అంతటా కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించింది. ఈద్ అల్ ఫితర్ సెలవుల్లోనూ అత్యవసర పరిస్థితులను సమర్థంగా నిర్వహించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించినట్టు అంబులెన్స్ సర్వీస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలీ దర్విష్ తెలిపారు. “అంబులెన్స్ సర్వీస్ పవిత్ర రమదాన్ మాసం, ఈద్ సెలవుల్లో అంతరాయం లేని సేవను నిర్ధారించడానికి కట్టుబడి ఉంది. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా విశ్లేషించబడిన మునుపటి డేటా ద్వారా  మేము నిర్ణయాలు తీసుకుంటాము, ”అని దర్విష్ అన్నారు. రమదాన్ సందర్భంగా ఉదయం వేళలతో పోలిస్తే సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా సర్వీసులు అందించినట్లు పేర్కొన్నారు.  

రమదాన్ సెలబ్రేషన్స్ సందర్భంగా కార్నిచ్, ఆస్పైర్ పార్క్, కటారా, సౌక్ వకీఫ్, సీలైన్ బీచ్, గహరియా, అల్ వక్రా, సెమైసిమా, ప్రసిద్ధ క్యాంపింగ్ సైట్‌ల వద్ద అదనపు అంబులెన్స్‌లను మోహరించనున్నారు. అంబులెన్స్ సర్వీస్ రోజుకు దాదాపు 800 కాల్స్ అందుకుంటుందని తెలిపారు. సెలవు దినాలలో క్లిష్టమైన కేసులను రవాణా చేయడానికి అంబులెన్స్ సర్వీస్ నుండి మూడు లైఫ్‌ఫ్లైట్ హెలికాప్టర్‌లను మోహరించామని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com