బోలోగ్నా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2025..సౌదీ అరేబియా పెవిలియన్‌..!!

- April 01, 2025 , by Maagulf
బోలోగ్నా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2025..సౌదీ అరేబియా పెవిలియన్‌..!!

బోలోగ్నా: ఇటలీలోని బోలోగ్నా ఫియర్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బోలోగ్నా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2025లో సౌదీ అరేబియా తన జాతీయ పెవిలియన్‌ను ప్రారంభించింది. సాహిత్యం, ప్రచురణ, ట్రాన్స్ లేషన్ కమిషన్ ఈ పెవిలియన్‌ను నిర్వహిస్తుంది.

సాహిత్య అథారిటీ సీఈఓ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్-వాసిల్ మాట్లాడుతూ.. సౌదీ భాగస్వామ్యం ప్రచురణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సాంస్కృతిక ఎంగేజ్ మెంట్ పెంచడానికి రూపొందించిన అనేక కార్యక్రమాలను ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.ప్రదర్శన సందర్భంగా దేశం గొప్ప మేధో వారసత్వం, సాంస్కృతిక గుర్తింపును హైలైట్ చేస్తాయని తెలిపారు.

"ఈ ప్రదర్శన సౌదీ ప్రచురణకర్తలు తమ ప్రపంచ ప్రత్యర్ధులతో కనెక్ట్ అవ్వడానికి, ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది" అని డాక్టర్ అల్-వాసిల్ పేర్కొన్నారు.

సౌదీ పెవిలియన్ కింగ్ సల్మాన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ ది అరబిక్ లాంగ్వేజ్, కింగ్ అబ్దులాజీజ్ పబ్లిక్ లైబ్రరీ, కింగ్ ఫహద్ నేషనల్ లైబ్రరీ, సౌదీ పబ్లిషింగ్ అసోసియేషన్ వంటి అనేక సాంస్కృతిక సంస్థలను నిర్వహిస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com