కొత్తగా డెలివరీ సేవను ప్రకటించిన ఎమిరేట్స్..ఏప్రిల్ ఫూల్స్ డే జోకా?
- April 01, 2025
దుబాయ్: మీ పరిసరాల్లో ఎమిరేట్స్ A350 ల్యాండింగ్ అవుతుందని, మీ ఇంటి వద్దకే పార్శిల్ డెలివరీ చేసే ఫ్లైట్ అటెండెంట్‌ను ఊహించుకోండి. దుబాయ్‌కు చెందిన ఎయిర్‌లైన్ “చాలా ముఖ్యమైన పార్శిళ్ల” కోసం కొత్త VIP సేవను ప్రకటించినప్పుడు అందరూ ఇలాగే ఊహించుకుంటున్నారు. కాగా, ఎమిరేట్స్ ప్రకటన సమయం దృష్ట్యా, ఇది ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా జోక్ అవునా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది .
“వాణిజ్య విమానయాన సేవా నమూనాల సరిహద్దులను బద్దలు కొడుతూ, ఎమిరేట్స్ V-I-Ps (చాలా ముఖ్యమైన పార్శిళ్లు) అక్షరాలా ఇంటింటికీ రవాణా చేయడానికి ఒక వినూత్నమైన కొత్త సేవను ప్రారంభిస్తోంది. అదే స్థాయిలో ఎయిర్‌లైన్‌కు ప్రపంచ గుర్తింపు, అవార్డులు లభించాయి” అని క్యారియర్ తన ప్రకటనలో తెలిపింది.
"ప్రారంభంలో ఏడు మార్కెట్లలో V-I-P లకు అందుబాటులో ఉంది. అనంతరం ఈ సేవ ఎమిరేట్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో ప్రవేశపెట్టబడుతుంది" అని క్యారియర్ తెలిపింది.
సాధారణంగా ఇలాంటి ఏప్రిల్ జోకులకు ఎమిరేట్స్ ప్రసిద్ధి చెందింది. 2024 లో కూడా 380 అంతస్తుల ఎమిరేట్స్ రెసిడెన్సెస్‌ను వెల్లడించింది. ఈ టవర్ నిర్మాణాన్ని ఫిబ్రవరి 31, 2025 న(ఫిబ్రవరిలో ఉండేది 28 రోజులు) ప్రారంభం కానుందని పేర్కొంది.
2023లోనూ ఇలాగే మరో ప్రకటన చేసింది. ఎయిర్‌లైన్ 'సీ లైన్'ను 'ప్రారంభించింది' - ఇది అట్లాంటిస్ దాటి ప్రయాణిస్తున్నట్లు చూపించబడిన ఒక అల్ట్రా-లగ్జరీ క్రూయిజ్ లైనర్ ఫోటోను షేర్ చేసింది. జూన్ 31న బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. (మళ్ళీ, జూన్‌లో ఎన్ని రోజులు ఉన్నాయి?), మొదటి క్రూయిజ్ ఏప్రిల్ 1, 2024న దుబాయ్ హార్బర్ నుండి కరాచీకి బయలుదేరనుందని తెలిపింది. కాగా, ఈ ఊహా చిత్రంలో స్కై లాంజ్, ట్రిపుల్-డెక్కర్ విమానం, డ్రైవర్ లేని డ్రోన్ ఉన్నాయి.
ఏప్రిల్ ఫూల్స్ డే జోక్ స్టేట్ మెంట్ చరిత్ర ఉన్నప్పటికీ, 2025 ప్రకటనలో స్పష్టమైన జోక్ సంకేతాలు లేవు. నివాస పరిసరాల్లో నిలిపి ఉంచిన A350 తప్ప. "మరిన్ని వివరాలు త్వరలో పంచుకోబడతాయి" అని ఎమిరేట్స్ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్