నకిలీ వర్క్ పర్మిట్లు..49 వాణిజ్య షాప్స్ పై దర్యాప్తు..తగ్గిన నేరాలు..!!

- April 01, 2025 , by Maagulf
నకిలీ వర్క్ పర్మిట్లు..49 వాణిజ్య షాప్స్ పై దర్యాప్తు..తగ్గిన నేరాలు..!!

మనామా: గత సంవత్సరం దాదాపు 30,000 వైద్య అత్యవసర పరిస్థితులు, 14,000 కంటే ఎక్కువ కుటుంబ రక్షణ కేసులు, నకిలీ వర్క్ పర్మిట్లను అమ్ముతున్నట్లు అనుమానించబడిన డజన్ల కొద్దీ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆపరేషన్స్ రూమ్ ఫిబ్రవరిలో 2,253 కాల్స్ మాత్రమే వచ్చాయని అంతర్గత మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.


దాదాపు 60 శాతం అత్యవసర కేసులు, 35 శాతం ట్రాఫిక్ సంబంధితవి కాగా, మిగిలినవి భద్రతా సంబంధితమైనవి ఉన్నాయి. ఆ నెలలో 39 నివేదికలకు కోస్ట్‌గార్డ్‌లు స్పందించారు. నాలుగు సముద్ర ప్రమాదాలకు సంబంధించినవి కాగా, 13 సహాయ కాల్స్ ఉన్నాయి. ఇరవై రెండు పడవల నుండి లేదా రక్షణ అవసరమైన వాటి నుండి వచ్చాయి. పౌర రక్షణకు సంబంధించి 1,262 కేసులను నిర్వహించింది.  సహాయం కోసం 580 కి పైగా అభ్యర్థనలు,  164 అగ్నిప్రమాదాలు సంభవించాయి. మరో 122 కాల్స్ ట్రాఫిక్ సంబంధితమైనవి ఉన్నాయి.

ఫిబ్రవరిలో 4,719 నివేదికలకు అంబులెన్స్ పారామెడిక్స్ స్పందించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 30,000 వైద్య సంఘటనలు నమోదు అయ్యాయని డేటా తెలిపింది.  444 ట్రాఫిక్ ప్రమాదాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి 867 రోగుల బదిలీలు, 18 అగ్నిప్రమాదాలతో సహా 411 ఇతర సంఘటనలు కూడా జరిగాయి.

దక్షిణ గవర్నరేట్‌లోని పోలీసులు గత 14 నెలల్లో 18,338 నివేదికలను నమోదు చేశారు. వాటిలో 15,986 2024 లో నమోదు అయ్యాయి. మిగిలినవి ఈ సంవత్సరం జనవరి,  ఫిబ్రవరిలో వచ్చినవి ఉన్నాయి. క్రిమినల్ కేసులు 7,300 కి పైగా ఉన్నాయి. అదే సంఖ్యలో పరిపాలనా ఫిర్యాదులు ఉన్నాయి.     

దక్షిణ ప్రాంతంలోని కుటుంబ, పిల్లల రక్షణ కార్యాలయాలు జనవరి 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు 14,900 నివేదికలను నమోదు చేశాయి.  ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో 63 గృహ హింస ఫిర్యాదులు, 90 కుటుంబ పరమైన ఫిర్యాదులు వచ్చాయి.  అదే విధంగా అనుమానిత నకిలీ వర్క్ పర్మిట్‌లపై గత సంవత్సరం 49 వాణిజ్య దుకాణాలపై దర్యాప్తు నిర్వహించారు. అనంతరం ఆయా కేసులను సంబంధిత సంస్థలకు రిఫర్ చేశారు. నివాస లేదా కార్మిక నియమాలను ఉల్లంఘించినందుకు పోలీసులు 116 మంది వలస కార్మికులను అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com