బీఆర్ఎస్ రజతోత్సవ పాటను విడుదల చేసిన కెసిఆర్
- April 03, 2025
హైదరాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. రచయిత, గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి గానం చేసిన బండెనక బండి కట్టి–గులాబీల జెండ పట్టి బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆవిష్కరించారు.
నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాల్ని రూపొందించాలని ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ రసమయికి సూచించారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్