విజయవాడ-ముంబై విమాన సమయం మార్చాలని కేంద్రమంత్రిని కోరిన ఎంపి బాలశౌరి

- April 04, 2025 , by Maagulf
విజయవాడ-ముంబై విమాన సమయం మార్చాలని కేంద్రమంత్రిని కోరిన ఎంపి బాలశౌరి

మచిలీపట్నం: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ నుంచి ముంబైకి నడుస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల సమయాల మార్పు విషయం పై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న విమాన సమయాలు ప్రయాణికులకు, ముఖ్యంగా వాణిజ్య, విద్య, వైద్య అవసరాలతో విజయవాడ నుండి ముంబైకి వెళ్లే ప్రజలకు అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం సాయంకాలం సమయంలో మాత్రమే విజయవాడ నుండి ముంబై కి ఇండిగో మరియు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతున్నారని, ఒకే సమయంలో ఉండటం వలన ముంబై లో పని ఉన్నవారు తప్పనిసరిగా ముంబై లో రాత్రి వేళ ఎక్కువ ఖర్చుతో గడపవలసి వస్తున్నదని, అదే సమయాలలో మార్పు జరిగి ఉదయం వేళలో విజయవాడ నుండి ముంబై కి విమానాలు నడపటం వలన కార్యాలయాలు పనిచేసే సమయంలో వెళ్లి పనులు పూర్తీ చేసుకొని సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకోవచ్చునని, అప్పుడు సమయం,డబ్బు వృధా కాకుండా ఉంటుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన మంత్రిని  స్వయంగా కలిసి వివరించి, ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఎంపీ బాలశౌరి కోరడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com