యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్..
- April 10, 2025
హైదరాబాద్: సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి స్కూల్ లో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ స్కూల్ లో అమరులైన పోలీసుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తరువాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ల కుటుంబాల పిల్లలకు 50శాతం సీట్లు కేటాయించారు. మరో 50శాతం సీట్లు స్థానికులకు కేటాయించారు.
ఓపెన్ కేటగిరీ విధానంలో సీట్లు అందుబాటులో ఉంటాయి. 1 నుంచి 5 తరగతుల్లో అడ్మిషన్ల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చు. ప్రతి క్లాసులో 40 సీట్లు ఉంటాయి. 5 తరగతుల్లో కలిపి మొత్తం 200 సీట్లు ఉంటాయి. అందులో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు ఉంటాయి. మిగతావి ఇతర పిల్లలకు కేటాయించారు.
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ లో విద్యాబోధన ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ స్కూల్ లో ఫీజులు రీజనబుల్ గా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య, సీబీఎస్సీ సిలబస్ ఉంటాయి. క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
- పాఠశాల అధికారిక వెబ్సైట్ http://yipschool.in ఓపెన్ చేయాలి
- వెబ్సైట్లో ‘అడ్మిషన్స్’ విభాగానికి వెళ్లి క్లిక్ చేయండి
- విద్యార్థి మొదటి పేరు
- విద్యార్థి చివరి పేరు
- తల్లిదండ్రుల మొదటి పేరు
- తల్లిదండ్రుల చివరి పేరు
- 1 నుంచి 5వ తరగతిలో ఏ క్లాస్‌లో చేరతారో టైప్ చేయండి
- పోలీస్ కుటుంబాలు లేదా నాన్ పోలీస్ కుటుంబాల్లో మీ ఆప్షన్ ఎంచుకోండి
- చిరునామా ఇవ్వండి
- ఈమెయిల్ ఐడీ ఇవ్వండి
- ఫోన్ నంబర్ టైప్ చేయండి
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్