సౌదీ అరేబియా నుండి అత్యవసర వైద్యంకోసం యూఏఈ ఎయిర్‌లిఫ్ట్ ..!!

- April 15, 2025 , by Maagulf
సౌదీ అరేబియా నుండి అత్యవసర వైద్యంకోసం యూఏఈ ఎయిర్‌లిఫ్ట్ ..!!

యూఏఈః యూఏఈ నివాసిని అత్యవసర వైద్య సంరక్షణ కోసం సౌదీ అరేబియా నుండి విజయవంతంగా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్టు యూఏఈ ప్రకటించింది.  విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో  యూఏఈ నేషనల్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ద్వారా ఎయిర్ అంబులెన్స్ మిషన్ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించింది. పేషంట్ ను తరలించడంలో సౌదీ అధికారులు అందించిన మద్దతుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపింది. 40 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య రావడంతో తక్షణ సహాయం అవసరమని NRRC తెలిపింది. చికిత్స కోసం అతన్ని రియాద్ ఆసుపత్రి నుండి  యూఏఈలోని సెంట్రల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com