2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు
- April 22, 2025
అమెరికా: చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) తాజాగా ముఖ్యమైన ప్రకటనలు చేసింది. 98వ ఆస్కార్ వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగనుంది.
2026 ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త విభాగం చేర్చబడింది–అచీవ్ మెంట్ ఇన్ కాస్టింగ్ ఇప్పటివరకు ప్రత్యేకంగా కాస్టింగ్ డైరెక్టర్ల పనిని గుర్తించని అకాడమీ, ఈసారి వారి ప్రతిభను గుర్తించి ఓ ప్రత్యేక అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ప్రాథమిక ఓటింగ్ ద్వారా షార్ట్ లిస్ట్, ఫైనల్ ఓటింగ్ ద్వారా విజేత ఎంపిక అలాగే, కాస్టింగ్ డైరెక్టర్లు తమ పని సరైనదిగా సమర్థించుకునేలా ముందుగా కొన్ని రౌండ్ల ద్వారా టెస్ట్‌లకు హాజరుకావాల్సి ఉంటుంది.
కృత్రిమ మేధ (AI) మరియు ఆస్కార్
ఇప్పటి వరకూ ఆస్కార్ అవార్డుల్లో ఏఐ ఆధారిత చిత్రాలపై స్పష్టత లేదు. కానీ 2026కు సంబంధించి అకాడమీ ఒక స్పష్టమైన ధృవీకరణ ఇచ్చింది. కృత్రిమ మేధ (AI) ఉపయోగించి రూపొందించిన చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇది ఇతర మూవీలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఏఐ మూవీల కంటే సాధారణ మూవీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అకాడమీ వెల్లడించింది. ఈ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్ నగరంలో ఉన్న డాల్బీ థియేటర్లో అత్యంత వైభవంగా జరగనుంది. జనవరి 2025 నుంచి డిసెంబర్ వరకు విడుదలైన మూవీలు ఆస్కార్ అవార్డులకు పోటీ పడనున్నాయి. అయితే మ్యూజిక్ విభాగంలో మాత్రం తుది గడువు ఈ ఏడాది అక్టోబర్ 15గా నిర్ణయించడం జరిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్