తిరుపతిలో ఫుడ్​సేప్టీ ల్యాబ్​ ఏర్పాటు

- April 23, 2025 , by Maagulf
తిరుపతిలో ఫుడ్​సేప్టీ ల్యాబ్​ ఏర్పాటు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఫుడ్​సేప్టీ ల్యాబ్​ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.ఆహార కల్తీల గుర్తింపు, వాటి నియంత్రణకు సంబంధించి ఇప్పటివరకు వాటి నమూనాలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్‌కు పంపాల్సి వచ్చేది. అనంతరం ఫలితాలు సైతం ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకునేలోగా పుణ్యకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం నమూనాల స్వీకరణకు నిరాకరిస్తుండటంతో ఐదు రాష్ట్ర స్థాయి ఫుడ్‌ సెఫ్టీ ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.తిరుపతిలో ఒకటి, తిరుమలలో టీటీడీ కోసం ప్రత్యేకంగా మరో ల్యాబ్‌ కేటాయించడం విశేషం. తిరుమలలోని ప్రయోగశాలను టీటీడీ అవసరాల కోసమే నిర్దేశించగా తిరుపతిలోని ప్రయోగశాలను రాయలసీమ అవసరాల కోసం వినియోగించనున్నారు. తిరుమలలో 12 వేల చదరపు అడుగుల భవనాన్ని టీటీడీ ఆహార భద్రతాధికారులకు అప్పగించగా రాష్ట్రంలో తొలి ప్రయోగశాల ఇక్కడే ప్రారంభించనున్నారు. టీటీడీకి చెందిన శ్రీదేవి కాంప్లెక్స్‌లో ప్రయోగశాల ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు.

ప్రయోగశాల
ఒక్కో జిల్లా నుంచి గరిష్ఠంగా 400 వరకు నమూనాల్ని పరీక్షించాల్సి ఉంటుంది. తిరుపతిలోని ప్రయోగశాలలో రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే నాలుగు వేల వరకు నమూనాలు పరీక్షించే వీలుంది. ప్రైవేటు వ్యక్తులు సైతం నమూనాల్ని పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఒక్కొక ప్రయోగశాలకు రూ.25 కోట్ల విలువైన పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే దీనికి సంబంధించి,మరోవైపు ప్రాంతీయ ఆహార ప్రయోగశాలలు ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టలేషన్ కోసంటెండర్ల ప్రక్రియ సైతం ముగిసింది. ముఖ్యంగా నూనెలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తాగునీరు, శీతల పానీయాలు, సుంగంధ వస్తువులు, వంట సరకులు, బేకరీ వస్తువులు వంటి వాటిని 15 విభాగాలుగా విభజించి 400 పైగా కల్తీలను గంటల వ్యవధిలో విశ్లేషించే వీలుంది.

పూర్ణచంద్రరావు మాట్లాడుతూ “తిరుమలలో త్వరలో, తిరుపతిలో మరో ఆరునెలల్లో ప్రయోగశాలలు ప్రారంభం అవుతాయి. అప్పటికప్పుడు నమూనాలు సేకరించి పరీక్షించి కేసులు నమోదు చేస్తాం. పూర్తిస్థాయిలో కల్తీని నియంత్రించేందుకు రాష్ట్రస్థాయి ప్రయోగశాలలు దోహదపడుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com