అబ్దల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి..!!

- April 25, 2025 , by Maagulf
అబ్దల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి..!!

కువైట్: గురువారం ఉదయం అబ్దల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. వారిలో ఒకరిని కేరళకు చెందిన అనురాజ్ నాయర్‌గా గుర్తించారు. అబ్దాలి రోడ్డులో వారు ప్రయాణిస్తున్న వాహనం కరిగిన సల్ఫర్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరు భారతీయులను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారందరూ కువైట్‌లోని బెహ్బెహానీ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com