ఒమన్ లో ట్యాంకర్ల నిర్వహణ నియంత్రణకు బైలా జారీ..!!

- April 28, 2025 , by Maagulf
ఒమన్ లో ట్యాంకర్ల నిర్వహణ నియంత్రణకు బైలా జారీ..!!

మస్కట్: అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) నీరు, మురుగునీటి రంగంలో స్వతంత్ర ట్యాంకర్ల నిర్వహణను నియంత్రించడానికి ఒక బైలా జారీ చేసింది. రాయల్ డిక్రీ నెం. 40/2023 ద్వారా ప్రకటించారు. ఈ కీలకమైన రంగంలో పనితీరు సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడం, సేవల ప్రామాణీకరణను పెంచడం దీని లక్ష్యమని తెలిపారు. 

నీటి రవాణా, సరఫరా రంగాలలో స్వతంత్ర ట్యాంకర్ ఆపరేటర్ల పనులను బైలా నియంత్రిస్తుంది. ఇది మురుగునీటి సేకరణతోపాటు శుద్ధి చేసిన నీటి సరఫరాను కూడా క్రమబద్ధీకరిస్తుంది.  నీరు, మురుగునీటి రంగం నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి,  వాటాదారుల మధ్య ప్రయోజనాల సమతుల్యతను నిర్ధారించడానికి APSR చేసిన ప్రయత్నాలను బైలా జారీ చేయడం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com