ఇండియన్ క్లబ్‌లో ‘మే క్వీన్’ పేరుతో అందాల పోటీలు..!!

- April 28, 2025 , by Maagulf
ఇండియన్ క్లబ్‌లో ‘మే క్వీన్’ పేరుతో అందాల పోటీలు..!!

మనామా: ప్రతి సంవత్సరం మే నెలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అందాల పోటీ జరుగుతుంది.  ఇది గత 60 సంవత్సరాలుగా ఇండియన్ క్లబ్‌లో ‘మే క్వీన్’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇండియన్ క్లబ్ మే క్వీన్ పోటీ అనేది క్యాలెండర్ ఈవెంట్‌గా నిర్వహించబడే ప్రముఖ అందాల పోటీగా గుర్తింపు పొందింది

ఈ సంవత్సరం, ఇండియన్ క్లబ్ మే క్వీన్ మే 23న ది ఇండియన్ క్లబ్ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ పోటీకి ప్రవేశం బహ్రెయిన్‌లో నివసిస్తున్న 17 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలందరు పాల్గొనవచ్చు. బహ్రెయిన్, భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్, నెదర్లాండ్స్, రష్యా, శ్రీలంక, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్ వంటి వివిధ దేశాలకు చెందిన మహిళలను ప్రతిష్టాత్మకమైన మే క్వీన్ క్రౌన్ కోసం పోటీలో నిల్వనున్నారు.

ఇండియన్ క్లబ్ మే క్వీన్ పోటీ వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తుంది. మే క్వీన్ క్రౌన్, మొదటి రన్నరప్, రెండవ రన్నరప్‌తో సహా బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్, బెస్ట్ హెయిర్‌డో వంటి వివిధ విభాగాల్లో విజేతలకును ప్రకటిస్తారు. విజేతలకు నగదు, ఆభరణాలు, ఫ్యాషన్ ఉపకరణాలు, గిఫ్ట్ హ్యాంపర్లు సహా ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తారు. మే క్వీన్ 2025 మొత్తం బహుమతి డబ్బు $3,000గా నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com