‘వేవ్స్‌’ సమ్మిట్‌ ఈవెంట్‌కు హాజ‌రైన చిరంజీవి..

- May 01, 2025 , by Maagulf
‘వేవ్స్‌’ సమ్మిట్‌ ఈవెంట్‌కు హాజ‌రైన చిరంజీవి..

ముంబయి: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరియు మహారాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మిట్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వైభవంగా కొనసాగనుంది.

మెగాస్టార్ చిరంజీవి హాజరు

ఈ సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా మారింది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరు. చిరంజీవి బుధవారం నాడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి ముంబయికి చేరుకున్నారు. ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. చిరుతో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్లు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, మలయాళ తార మోహన్‌లాల్, పలు దేశీయ, అంతర్జాతీయ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశం మీడియా, సినిమా, డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ రంగాల ప్రాతినిధ్యంతో ఒక గొప్ప వేదికగా నిలవనుంది. పరిశ్రమల మధ్య మంతనాలు, పెట్టుబడులు, భవిష్యత్తు అవకాశాలపై చర్చలు జరగనున్నాయి.

ప్రధాని మోదీ ప్రత్యేక హాజరు

ఈ సమ్మిట్‌కు ప్రధానంగా హాజరయ్యే వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పేరున్నాడు. ఈ రోజు ఉదయం మోదీ అధికారికంగా సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. తన పర్యటనలో భాగంగా మోదీ మీడియా, ఎంటర్టైన్‌మెంట్, OTT, టెక్ కంపెనీల సీఈఓలు, నిర్మాతలు, దర్శకులతో 10 గంటలపాటు చర్చలు జరపనున్నారు. భారతీయ సృజనాత్మక పరిశ్రమను ప్రపంచ స్థాయికి చేర్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువలు, సమాజంపై మీడియా ప్రభావం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com